ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (22:02 IST)

కడుపుతో వున్న భార్యను ఏటీఎంలో కాల్చి చంపేశాడు.. కారణం తమ్ముడు?

murder
యూపీలో ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యనే కడుపుతో వుందనే కనికరం లేకుండా హతమార్చాడు ఓ కిరాతక భర్త. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో తన సోదరుడితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎటిఎంలో కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టించింది. 
 
నిందితుడు తన భార్యను చంపిన తర్వాత అతని ఇంటికి చేరుకున్నాడు. అతని తమ్ముడిని కూడా ఇంట్లో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో నిందితుడి తమ్ముడికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మహిళ గర్భవతి అని, ఆ బిడ్డ తన తమ్ముడిదేనని భర్త అనుమానించాడని అందుకే హతమార్చాడని తెలుస్తోంది. 
 
మండి ఠాణా ప్రాంతంలో ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎటిఎంలోకి ప్రవేశించిన భర్త తన భార్యను అనేకసార్లు కాల్పులు జరిపి చంపినట్లు ప్రాథమిక సమాచారం. భర్త చేతిలో హత్యకు గురైన మహిళకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. మహిళను ఆలియాగా, ఆమె భర్త జీషన్‌గా గుర్తించారు.