సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (22:32 IST)

తోబుట్టువుల మధ్య వివాహ సంబంధమా..? చట్ట విరుద్ధం.. హర్యానా కోర్టు

వావి వరుసలు మంటగలిసిపోతూ మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్న తరుణంలో పంజాబ్ హర్యానా హైకోర్టు గట్టి తీర్పునిచ్చింది. హిందూ వివాహ చట్టం ప్రకారం తోబుట్టుల మధ్య వివాహం చట్ట విరుద్దమని పంజాబ్‌ హర్యానా హైకోర్టు కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్‌లో అమ్మాయి మేజర్‌ అని తెలిపినప్పటికీ ఇది న్యాయ సమ్మతం కాదని కేసును విచారించిన న్యాయమూర్తి పేర్కొన్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన పిటిషనర్‌ తనపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్‌ 363 (కిడ్నాప్‌), 366 ఏ వంటి సెక్షన్లు ఖన్నాసిటిలోని రెండవ ఠాణాలో నమోదయ్యాయి. వాటిపై ముందస్తు  బెయిల్‌ మంజూర్‌ చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు.

ఈ ముందస్తు బెయిల్‌ను ప్రభుత్వ తరుపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. వారిద్దరూ సొంత అన్నదమ్ముల బిడ్డలు కావడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని అన్నారు. పిటిషన్‌ పరీశీలించిన న్యాయమూర్తి వారిద్దరూ కలిసి ఉంటున్నారని చెప్తున్నప్పటికీ.. బాలిక మైనర్ అయినా.. 18 ఏళ్లు నిండిన తర్వాత కూడా వారు చేసుకునే పెళ్లి చట్ట సమ్మతం కాదన్నారు. 
 
ఇంకా పిటిషనర్ తన సొంత తల్లిదండ్రుల నుంచి ప్రాణానికి హాని ఉందన్నారు. తనను వేధించకుండా చూడాలని వేసిన పిటిషన్‌ని, కోర్టు సెప్టెంబర్‌ 7న కొట్టివేసింది. ప్రభుత్వం ఇద్దరికి రక్షణ కల్పించాలని ఆదేశిందని న్యాయమూర్తి అన్నారు. అంతేగాకుండా పిటిషన్‌లో తాను బాలికకూ సోదరుడినవుతాననే విషయాన్ని వెల్లడించలేదని.. ఏది ఏమైనా తోబుట్టువుల మధ్య వివాహం చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చింది.