గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (14:47 IST)

ర్యాగింగ్ చేశారు.. బాడీ మసాజ్ చేయమన్నారు..

Dutee Chand
Dutee Chand
భువనేశ్వర్‌లోని బీజేబీ కళాశాలకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో.. భారత్ స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ద్యుతి తాను హాస్టల్‌లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న వేధింపులను గుర్తుచేసుకుంది. 
 
భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉన్నప్పుడు తనను సీనియర్లు ర్యాగింగ్ చేశారని, బాడీ మసాజ్ చేయమని తీవ్రంగా వేధించేవారని చెప్పుకొచ్చింది. స్ప్రింటర్ కూడా ఆమె ఆర్థిక పరిస్థితిని ఎగతాళి చేశారని తెలిపింది.
 
"నేను ఇన్ ఛార్జ్ హాస్టల్‌కు ఫిర్యాదు చేసినప్పుడు, నన్ను తిట్టేవారు. ఇది నన్ను మానసికంగా దెబ్బతీసింది. ఆ సమయంలో నేను నిస్సహాయంగా ఉన్నాను' అని 26 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ తెలిపింది.