శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (13:02 IST)

మసాజ్ సెంటర్ ముసుగులో అలాంటి పనులు

మసాజ్ సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... ఏఎస్‌రావునగర్‌లో గ్లోవిష్‌ బ్యూటీ కేర్‌ పేరుతో కొంత కాలంగా మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. 
 
ఇందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు  ఆకస్మిక దాడులు దాడి చేశారు. 
 
ఈ సందర్భంగా మాదిపల్లి మహేశ్‌ అనే వ్యక్తితో పాటు, మరో ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ తెలిపారు.