మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

మసాజ్ పేరుతో మజాగా వ్యభిచారం.. ఎక్కడ?

మసాజ్ పేరుతో మజాగా వ్యభిచారం నిర్వహిస్తూ వచ్చిన ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖైరతాబాద్ ఏసీ గార్డ్స్ చింతల్ బస్తీలో ఫిజియో థెరపీ పేరుతో ఓ మసాజ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా ఆ మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నట్టుగా సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెంచారు. 
 
ఓ కానిస్టేబుల్‌ను మఫ్టీలో పంపారు. ఆ కానిస్టేబుల్ అక్కడ డబ్బులు ఇస్తుండగా పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.