గర్భంగా వున్నారా? ఐతే తొమ్మిది నెలలు లీవు తీసుకోండి.. నో ప్రాబ్లమ్..
గర్భంగా వున్నారా? ఐతే ప్రసవానికి తొమ్మిది నెలలు సెలవులు తీసుకోవచ్చునని తమిళనాడు సర్కారు ప్రభుత్వ ఉద్యోగినులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో తాత్కాలికంగా విధులు నిర్వర్తించే మహిళా ఉద్యోగినులకు మెటర్నటీ లీవులను ఆరు నెలల నుంచి 9 నెలలకు పొడిగించినట్లు తమిళనాడు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
పాఠశాలలతో పాటు అన్నీ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు తొమ్మిది నెలల పాటు మెటర్నటీ లీవులు ఇవ్వడం జరుగుతోంది. గతంలో ఈ లీవులు ఆరు నెలలకే పరిమితం. కానీ ప్రస్తుతం 9 నెలల పాటు ఈ సెలవులను పొడిగిస్తున్నట్లు తమిళనాడులోని యడప్పాడి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తాత్కాలిక విధుల్లో వున్న మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.