శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (14:39 IST)

గడ్డం గీసుకుంటావా? చచ్చిపోనా? అంటూ భార్య బెదిరిస్తోందని కోర్టు మెట్లెక్కిన భర్త!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో ఓ విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. గడ్డం గీసుకుని సల్మాల్ ఖాన్, షారూక్ ఖాన్‌లా ఉండాలని లేనిపక్షంలో పిల్లలతో కలిసి చచ్చిపోతానని తన భార్య బెదిరిస్తోందంటూ ఓ భర్త కోర్టు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో ఓ విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. గడ్డం గీసుకుని సల్మాల్ ఖాన్, షారూక్ ఖాన్‌లా ఉండాలని లేనిపక్షంలో పిల్లలతో కలిసి చచ్చిపోతానని తన భార్య బెదిరిస్తోందంటూ ఓ భర్త కోర్టు మెట్లెక్కాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
అర్షద్ బద్రుద్దీన్ అనే వ్యక్తి మీరట్‌లోని ఓ మసీదులో ఇమామ్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, నలుగురు పిల్లలున్నారు. ఆ మత ఆచారం ప్రకారం అర్షద్ గడ్డం పెంచాడు. దీనిపై దంపతుల మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. గడ్డం తీసుకోవాలని.. షారుఖ్, సల్మాన్ తరహాలో ఉండాలని భర్తపై భార్య ఒత్తిడి చేస్తూ వచ్చింది. అంతేనా.. గడ్డం తీసేయాలి.. లేదంటే చచ్చిపోతానని భార్య బెదిరించేది. 
 
ఈ పరిస్థితుల్లో రంజాన్ పండుగకు పిల్లలకు మోడ్రన్ డ్రెస్సులు కొంటానని భార్య పేర్కొనడం.. దీనికి అర్షద్ నో చెప్పడం జరిగిపోయాయి. ఈద్ మరుసటి రోజు ఓ గదిలోకి వెళ్లిన ఆమె గడియపెట్టేసుకుంది. కంగారు పడిన అర్షద్ కిటీలోకి నుండి చూశాడు. ఫ్యాన్‌కు తాడు వేసి ఉరి వేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గమనించి ఇతరుల సహాయంతో తలుపులను బద్దలు కొట్టి ఆమెను రక్షించాడు.
 
ఆ తర్వాత ఇరుగుపొరుగువారు ఆమెను ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావ్ అని ప్రశ్నించాడు. అపుడు ఆమె తన మనసులోని మాటను వారికి కూడా చెప్పింది. తన భర్తతో తక్షణం గడ్డం తీయించక పోతే పిల్లలకు విషమిచ్చి తాను చనిపోతా అని బెదిరించింది. దీంతో వారంతా ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. 
 
ఒకవేళ తాను షేవింగ్ చేసుకోకుంటే తన భార్య ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడుతుందోనని ఆ అర్షద్ భయపడిపోయాడు. నిజంగానే తన భార్య ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించుకున్నాడు. దీంతో తనతో పాటు.. తన భార్యా పిల్లలను రక్షించుకునేందుకు మెజిస్ట్రేట్‌కు లేఖ రాశాడు. తన గోడును అందులో వెళ్లబోసుకున్నాడు. ఇమామ్ లేఖకు మెజిస్ట్రేట్ స్పందించి మీరట్ ఎస్పీకి ఈ విషయం చూడాలని ఆదేశాలు జారీ చేశారు.