శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (09:58 IST)

29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. కోవిడ్‌ దఅష్ట్యా ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు.

రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమావేశ మవుతాయని వెల్లడించారు. సెప్టెంబరులో జరిగిన విధంగానే లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్లలో సమావేశాలు కొనసాగుతాయని ఓం బిర్లా తెలిపారు.

రాష్ట్రపతి ప్రసంగం మాత్రం సెంట్రల్‌ హాల్‌లో ఉంటుందని చెప్పారు. క్వశ్చన్‌ అవర్‌ యథావిధిగా ఉంటుందన్నారు. ఇక సమావేశానికి వచ్చే ఎంపిలంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఎంపిల కుటుంబ సభ్యులకు, పిఎలు, వ్యక్తిగత సిబ్బంది కూడా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని, ఇందుకోసం ఈ నెల 27, 28 తేదీల్లో పార్లమెంట్‌ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

పార్లమెంట్‌ ఆవరణలో ఉన్నక్యాంటీన్లలో భోజనంపై ఇచ్చే రాయితీని ఎత్తేస్తున్నట్లు ఓంబిర్లా ప్రకటించారు. రాయితీ తొలగింపుతో ఏటా రూ.8కోట్లకు పైగా ఆదా అవుతుందని లోక్‌సభ సెక్రటేరియట్‌ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు పార్లమెంట్‌ క్యాంటీన్లను ఉత్తర రైల్వే నిర్వహించగా.. ఇకపై ఐటిడిసి నడుపుతుందని స్పీకర్‌ చెప్పారు.