బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 17 అక్టోబరు 2018 (12:11 IST)

పరువునష్టం దావా వేస్తే బెదిరిపోతామా? కాస్కోండి చూద్దాం..

లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ ఎదురుదాడికి దిగారు. తనపై ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్ట్ ప్రియారమణిపై నేరపూరిత పరువునష్టం దావా వేశారు.

లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ ఎదురుదాడికి దిగారు. తనపై ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్ట్ ప్రియారమణిపై నేరపూరిత పరువునష్టం దావా వేశారు. గతంలో పలు పత్రికలకు ఎడిటర్ గానున్న ఎంజే అక్బర్‌ తమను లైంగింకంగా వేధించినట్లు  12 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. 
 
తనపై మొదట ఆరోపణాస్త్రాలు సంధించిన ప్రియారమణిపై మాత్రమే ఎంజే అక్బర్‌ క్రిమినల్‌ పరువునష్టం దావా వేశారు. అయితే కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ వేసిన దావాతో బెదిరిపోనని జర్నలిస్టు ప్రియా రమణి స్పష్టం చేశారు. అదే విధంగా తనపై లైంగికదాడి ఆరోపణలు చేసిన రచయిత్రి, నిర్మాత వింటానందాపై సినీ నటుడు అలోక్‌నాథ్ పరువునష్టం దావా వేశారు. 
 
పరువునష్టం కింద తనకు ఒక రూపాయి నష్టపరిహారం చెల్లించాలని, తనకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలోక్ నాథ్ నోటీసులను న్యాయపరంగానే సవాల్ చేస్తామని వింటానందా స్పష్టంచేశారు.
 
2006లో ఓ షూటింగ్ సమయంలో మద్యం తాగాలని ఒత్తిడి చేయడంతోపాటు, ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపబోయారని అసిస్టెంట్ డైరెక్టర్ నమిత ప్రకాశ్ తనపై చేసిన ఆరోపణలకు బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ శ్యామ్‌కౌశల్ క్షమాపణ చెప్పారు. ఒకవేళ పొరపాటున ఎవరినైనా నొప్పిస్తే, అందుకు క్షమాపణలు చెప్తున్నానని శ్యామ్ అన్నారు.