సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (14:51 IST)

మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని.. మూడుసార్లు...?

మైనర్ బాలికలపై అఘాయిత్యాలు ఎక్కువ అయిపోతున్నాయి. తాజాగా గుర్గావ్‌లో జరిగిన ఘటన కారణంగా బాధితురాలైన ఓ బాలిక పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించింది. అందుకు కారణాలు ఆరా తీస్తే ఆమె రేప్‌కు గురైనట్లు చెప్పింది. 
 
వివరాల్లోకెళితే 16 సంవత్సరాలు ఉన్న బాలిక జనవరి 24వ తేదీన పాఠశాలకు వెళ్లే సమయంలో గౌరవ్ శైనీ (24) అనే యువకుడు స్కూలు గేటు ముందు కారు ఆపి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని, నిర్మానుష్య ప్రదేశంలోకి ఆమెను లాక్కెళ్లి, మూడుసార్లు రేప్‌కు పాల్పడ్డాడని పోలీస్ అధికారి కాంతా దేవి చెప్పారు.
 
సోమవారం ఉదయాన్నే ఆమె పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించినందున ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కంప్లైంట్ అందుకున్న తర్వాత, తాము వెంటనే నిందితుడి ఇంటికి వెళ్లి, అతడిని అదుపులోకి తీసుకున్నట్లు, అలాగే వైద్య పరీక్షలు కూడా బాధితురాలు రేప్‌కి గురైనట్లు ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు.