బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2017 (16:01 IST)

సోదరుడే ఆ పని చేశాడు.. టాయ్‌లెట్ కిటికీ నుంచి పసికందును?

మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ముంబై నగరంలో వరుసకు సోదరుడైన సమీప బంధువు 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది

మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ముంబై నగరంలో వరుసకు సోదరుడైన సమీప బంధువు 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది.

ఈ ఘటన ముంబై, వసాయి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వసాయి ప్రాంతంలోని ఓ పబ్లిక్ టాయ్‌లెట్ కిటికీ నుంచి అప్పుడే పుట్టిన చిన్నారిని కిందకు విసిరివేశారు. 
 
అయితే ప్రాణాపాయం నుంచి ఆ శిశువు తప్పించుకుంది. శిశువు ఏడుపు శబ్ధం విన్న స్థానికులు ఆ పసికందును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ శిశువు ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు జరిపారు. ఈ దర్యాప్తులో అత్యాచారం బాగోతం బయటపడింది. 
 
సోదరుడైన సమీప బంధువు మైనర్ బాలికపై పలుసార్లు అత్యాచారం జరపాడని.. దీంతో మైనర్ బాలిక గర్భం దాల్చిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మైనర్ బాలిక, శిశువు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.