శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (11:39 IST)

ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకోవాల్సిందే

పలు సంచలన నిర్ణయాలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీలో పొగడ్తలతో సమయాన్ని వృధా చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రులు, ఎమ్మెల్యేలను హెచ్చరించిన సంగతి తెలిసిందే.
 
తాజాగా ఎమ్మెల్యేలు, మంత్రులు వారి నివాసాల నుండి క్యారేజీలు తెచ్చుకోవాల్సిందేనని ఆదేశించారు. అసెంబ్లీలోని భోజనశాలను మూసివేయాలని, అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక నుండి క్యారేజీలు తీసుకురావాల్సి వుంటుందని పేర్కొన్నారు. 
 
అలాగే తన కాన్వాయ్‌తో సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో కాన్వాయ్‌లోని కార్ల సంఖ్యను తగ్గించారు. అయితే అన్నాడిఎంకె నెలకొల్పిన అమ్మ క్యాంటీన్లను కొనసాగించారు. ఇలా వరుసగా ప్రజాహిత నిర్ణయాలతో స్టాలిన్‌ దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకుంటున్నారు.