ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ముద్దులు దొంగోడికి మూతి పగిలింది... సీరియల్ కిస్సర్‌ చేతులకు బేడీలు

serial kisser
ముద్దుల దొంగోడికి మూతి పగిలింది. సీరియల్ కిస్సర్‌ను పోలీసులు అరెస్టు చేసి మూతి పగులగొట్టారు. పైగా, అతని మానసికస్థితి బాగోలేదంటూ వచ్చిన వార్తా కథనాలన్నీ అసత్యాలేనని తేలింది. పైగా, అతని వెనుక ఓ పెద్ద దొంగ ముద్దుల గ్యాంగ్ ఉన్నట్టు బయటపడింది.
 
బిహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ అక్రమ్ అనే అకతాయి రోడ్డుపై ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని ముద్దులు పెట్టేవాడు. అతని దుశ్చర్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు దృష్టిసారించారు. ఇటీవల జమూయ్‌ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగినికి బలవంతంగా ముద్దుపెట్టగా, ఆ వీడియో మరింతగా వైరల్ అయింది. 
 
దీంతో ఆ ప్రాంతంలో నివసించే మహిళలు బయటకు రావాలంటేనే భయంతో వణికిపోసాగారు. దీంతో పోలీసుల అతనిపై నిఘా వేశారు. అతను ఓ సీరియల్ కిస్సర్ మాత్రమే కాదనీ, ఓ నేరగాళ్ల గ్యాంగ్‌ను కూడా నడుపుతున్నట్టు తేల్చారు. 
 
ఈ కేసులో అతనితో పాటు మరో నలుగురు ముఠా సభ్యులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా కలిసి నేరాలు చేసినట్టు అంగీకరించారు. కేవలం ముద్దులకే కాకుండా వీరు అత్యాచారాలకు కూడా పాల్పడినట్టు విచారణలో తేలింది.