ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మార్చి 2023 (14:57 IST)

రజనీకాంత్ కుమార్తె ఇంటిలో 60 సవర్ల బంగారం చోరీ

aishwarya rajinikanth
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె, హీరో ధనుష్ సతీమణి ఐశ్వర్య రజనీకాంత్ ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోపడిన దొంగలు ఏకంగా 60 సవర్ల బంగారం నగలను చోరీ చేశారు. లాకర్లలో దాచిన ఈ నగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చెన్నై తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
అయితే, ఈ చోరీ గత ఫిబ్రవరిలో జరిగింది. దీనిపై ఆమె అపుడే ఫిర్యాదు చేయగా ఇపుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం జరిగిన తన సోదరి వివాహంలో ఆ ఆభరణాలను ధరించానని, ఆ తర్వాత వాటిని ఇంట్లోనే లాకర్‌లో భద్రపరిచానని, అప్పటి నుంచి దాన్ని మళ్లీ తెరిచి చూడలేదని ఆమె ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 10న దాన్ని తెరిచి చూడగా.. అందులో విలువైన ఆభరణాలు కనిపించలేదన్నారు. ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు పని మనుషులపై కూడా సందేహం ఉన్నట్టు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఐశ్వర్ రజనీకాంత్.. విష్ణు విశాల్, విధార్థ్ హీరోలుగా రజనీకాంత్ గెస్ట్ పాత్రలో "లాల్ సలామ్" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.