శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (13:54 IST)

రతన్ టాటా వీలునామా రాసిన ఆ రహస్య వ్యక్తి ఎవరు?

ratan tata
దేశ దిగ్గజ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో యావత్ దేశం కంటపడింది. గొప్ప మానవతామూర్తిగా, సమాజ సేవకుడుగా పేరుగాంచిన రతన్ టాటా తనకున్న వేల కోట్ల ఆస్తి సోదరుడు జమ్మీ ఆస్తిని సోదరుడు జమ్మీ టాటాకు, తన వద్ద పని చేస్తున్న వారికి పెంపుడు శునకాలకు కూడా వీలునామా రాశారు. 
 
తాజాగా బయటకు వచ్చిన ఆయన  వీలునామా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక రహస్య వ్యక్తికి తన ఆస్తిలో రూ.500 కోట్లు ఇవ్వాలని వీలునామాలో ఆయన పేర్కొన్నట్టు సమాచారం. జంషెడ్‌పూర్‌కు చెందిన ట్రావెల్స్ వ్యాపారి మోహన్ దత్తానే ఆ రహస్య వ్యక్తి అని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. టాటా వద్ద ఆరు దశాబ్దాలకు పైగా మోహన్ దత్తా నమ్మకంగా పనిచేసారు. దత్తాకు చెందిన స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ 2013 నుంచి తాజ్ సర్వీస్‍‌తో కలిసి పని చేస్తుంది. 
 
టాటా గ్రూప్ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం టాటా కుటుంబానికి దత్తా చాలా సన్నిహితంగా ఉండేవారు. రతన్ టాటా మరణించినపుడే ఆయనకు తనకున్న సాన్నిహిత్యం గురించి దత్తా మాట్లాడుతూ, టాటా తనకు 24 యేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. తాను జీవితంలో ఎదగడానికి టాటా ఎంతో సాయం చేశారని తెలిపారు.