శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (09:51 IST)

60 నెలల్లో 60 కోట్ల మందికి పైగా శౌచాలయాలు: మోదీ

భారత్‌ బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మారినందుకు సంతోషంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌ అహ్మదాబాద్‌లో స్వచ్ఛ భారత్‌ దివస్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారత్​ను బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా ప్రకటించారు మోదీ. 60 కోట్ల మందికిపైగా శౌచాలయాలు అందుబాటులోకి తెచ్చామని ఆయన చెప్పారు. దీన్ని చూసి ప్రపంచమే అబ్బురపడిందని మోదీ తెలిపారు.

60 నెలల్లో 60 కోట్ల మందికి పైగా శౌచాలయాలు అందుబాటులోకి తెచ్చామని.. దాదాపు 11 కోట్లకు పైగా శౌచాలయాల నిర్మాణం చేపట్టామని తెలిపారు. భారీగా శౌచాలయాల నిర్మాణంతో ప్రపంచమంతా అబ్బురపడిందని ప్రధాని అన్నారు.

సబర్మతి ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో సందేశం రాసిన మోదీ.. గాంధీ కలలు కన్న స్వచ్ఛభారత్‌ స్వప్నాన్ని సాక్షాత్కారం చేస్తున్నామని పేర్కొన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా 150 రూపాయల నాణెంతో పాటు ఆరు రకాల స్టాంపులను విడుదల చేశారు ప్రధాని మోదీ.