శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2019 (09:35 IST)

మోదీ అమెరికా పర్యటన పై ఎన్నో ఆశలు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై భారత్ గంపెడాశలు పెట్టుకుంది. ఈ పర్యటన తో మన దేశానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 21న ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. 27 వరకు సాగనున్న ఈ పర్యటనలో.. 'హౌదీ మోదీ' సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రధాని.

అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్​తో భేటీ కానున్నారు. మోదీ పర్యటన వివరాలపై అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు స్మితా శర్మ సమగ్ర విశ్లేషణ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో వేదిక పంచుకోవడం, చమురు కంపెనీలతో చర్చ, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగే వాతావరణ మార్పులో విధానాలపై ప్రసంగం, సాధారణసభలో కీలక ప్రసంగం సహా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన బిజీబిజీగా గడవనుంది.

పాకిస్థాన్​తో ఉద్రిక్తతల నేపథ్యంలో 20 దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు మోదీ. శుక్రవారం అమెరికా వెళ్లిన మోదీ హ్యూస్టన్, న్యూయార్క్​ల్లో నగరాల్లో ప్యాకేజీ అజెండా ఆయన కోసం వేచిచూస్తోంది. ప్రపంచ చమురు దిగ్గజాలైన ఎక్జాన్ మొబైల్, బీపీ వంటి సంస్థలతో మోదీ శనివారం భేటీ కానున్నారు.
 
జిన్​పింగ్​ తో భేటీ
మరికొద్ది వారాల్లో భారత్-చైనా అగ్రనేతలు నరేంద్రమోదీ, షి జిన్​పింగ్ భేటీ కానున్నారు. జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు నేపథ్యంలో పాకిస్థాన్ అనుకూలంగా మాట్లాడిన డ్రాగన్ దేశం.. ఈ సదస్సులో ఏ వైఖరి అవలంబించనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇప్పటివరకూ ఇలా ఎన్నో అడుగులు వేసినప్పటికీ భారత్​, చైనాల మధ్య నెలకొన్న అపనమ్మకాలు.. అతికష్టం మీద తీరే అవకాశాలు ప్రస్తుతం కన్పిస్తున్నాయి. గతేడాది జరిగిన వుహాన్​ సదస్సు ఇచ్చిన ఉత్సాహంతో చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​ను అనధికారిక పర్యటన కోసం అక్టోబర్​లో భారత్​కు రావాలని ఆహ్వానించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.

షాంఘై సహకార సంస్థ(ఎస్​సీఓ), జపాన్​​లో జరిగిన జీ-20 దేశాల సదస్సు వేదికగా ఇప్పటికే ఇరునేతలు ఈ ఏడాదిలో రెండు సార్లు భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఇరునేతల భేటీకి సన్నాహాలు జరుగుతున్న వేళ చైనా టెక్​ దిగ్గజం హువావే 5జీ నెట్​వర్క్​కు భద్రతా అనుమతులు ఇవ్వకూడదని భారత్​పై ఒత్తిడి తెస్తోంది అగ్రరాజ్యం అమెరికా.

సమగ్ర ప్రాంతీయ ఆర్థిక సహకారం(ఆర్​సీఈపీ)పై చైనాతో ఆసియాన్ దేశాల విముఖత, వుహాన్​లో అవగాహనకు వచ్చిన బీసీఐఎమ్​(బంగ్లాదేశ్, చైనా, భారత్, మయన్మార్) ఆర్థిక నడవా, జపాన్​ పెట్టుబడుల ప్రోత్సాహం కోసం.. ఈశాన్య దేశాల సహకారం నుంచి చైనాను దూరంగా ఉంచడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.