శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2017 (12:01 IST)

టీటీవీ దినకరన్ ఒక్కో ఆకుకి రూ.25 కోట్లు, ఈసీకే లంచం ఇవ్వబోయాడు... ఇప్పుడు పారిపోయాడు...

తమిళనాడు రాజకీయాలు నిత్యం ఉత్కంఠగా మారుతున్నాయి. రోజుకోమలుపు తిరుగుతున్నాయి. శశికళ వర్గానికి తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ గుర్తు కోసం ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి అన్న

తమిళనాడు రాజకీయాలు నిత్యం ఉత్కంఠగా మారుతున్నాయి. రోజుకోమలుపు తిరుగుతున్నాయి. శశికళ వర్గానికి తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ గుర్తు కోసం ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి అన్నాడీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ దినకరన్‌ బుక్కయ్యారు. ఆయనపై ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు ఆకులు అన్నాడీఎంకే పార్టీ గుర్తు అనే విషయం తెలిసిందే. దీనికోసం పన్నీర్‌ వర్గం, శశికళ వర్గం ముమ్మరంగా పోటీ పడింది. దీంతో ఈ గుర్తుతో పాటు.. ఆ పార్టీని కూడా తాత్కాలికంగా స్తంభింజేసింది. 
 
ఇదిలావుండగా, అన్నాడీఎంకే అధికారిక ఎన్నికల గుర్తు రెండాకులు కోసం ఆయన రూ.50 కోట్ల లంచం ఇచ్చారు. దీంతో ఆయనపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, దినకరన్ ఏజెంట్ నుంచి రూ.1.30 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది శశికళ వర్గానికి తేరుకోలేని ఎదురుదెబ్బ. 
 
ఆర్కే నగర్ ఉపఎన్నికలో శశికళ వర్గం తరపున పోటీచేసిన టీటీవీ దినకరన్‌ పోటీ చేశారు. అయితే, ఈ ఎన్నికల్లో రెండాకుల గుర్తు కోసం ఆయన శతవిధాలా ప్రయత్నించారు. పార్టీ అధికారిక సింబల్ అయిన రెండాకుల గుర్తు కోసం ఆయన అధికారులకు లంచం ఇచ్చినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులు దినకరన్ పేరు చెప్పడంతో పోలీసులు ఆయనపై దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ కేసులో అరెస్టయిన ఓ నిందితుడి దగ్గర నుంచి పోలీసులు రూ.1.50కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 
 
కాగా, ఆర్కేనగర్ ఓటర్లకు భారీగా డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెల్సిందే. అంతకుముందు అధికారులు శశికళ వర్గీయులు, మంత్రుల ఇళ్లలో సోదాలు నిర్వహించి పెద్దఎత్తున నగదుతో పాటు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ షాక్‌లో నుంచి కోలుకోకముందే ఢిల్లీ పోలీసుల నిర్ణయం శశకళ వర్గాన్ని శరాఘాతంగా తాకింది. ఇప్పటికే లంచం కేసులో విచారణ ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు త్వరలో ఎన్నికల సంఘానికి నివేదిక అందించనున్నట్టు చెబుతున్నారు.