గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (18:24 IST)

అత్త క్షణికావేశం.. కోడలి నిండు ప్రాణాలు బలి.. ఎక్కడ?

అత్తాకోడళ్ల గొడవ యుగాలు గడిచినా మారేలా లేదు. తాజాగా ఓ అత్త క్షణికావేశం ఓ కోడలి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జార్ఖండ్ రాష్ట్రంలోని సెరాయ్‌కేలా-ఖాస్వాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఝావ్రీ గ్రామానికి చెందిన భవానీ లాయెక్ (22), ఆమె అత్త గీతా లాయెక్ మధ్య ఆదివారం మధ్యాహ్నం గొడవ జరిగింది. ఇద్దరిమధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. 
 
ఈ క్రమంలో ఆగ్రహం పట్టలేకపోయిన అత్త గీతా లాయెక్ గొడ్డలి తీసుకుని కోడలు భవానీ లాయెక్‌పై దాడికి పాల్పడింది. అయితే, గొడ్డలి తలపై బలంగా తగలడంతో భవానీ లాయెక్ అక్కడికక్కడే పడిపోయింది. 
 
ఇరుగుపొరుగు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భవానీ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గొడవ జరిగినప్పుడు తాను విధులకు వెళ్లినట్లు అతను తెలిపాడు.