సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 మే 2017 (10:32 IST)

భారత సైనికుల తలలు తెగనరికిన పాక్ జవాన్ల తలలు నరికితే రూ.5 కోట్లు : ముస్లిం సంస్థ వెల్లడి

ఇండో-పాక్ సరిహద్దుల్లో భారత జవాన్ల తలలు నరికి పాకిస్థాన్ జవాన్ల తలలు తెగనరికి తెచ్చిన వారికి రూ.5 కోట్ల నగదు బహుమతి ఇస్తామని ఓ ముస్లిం సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ముస్లిమ్ యువ ఆటంకవాది విరోధి సమితి సం

ఇండో-పాక్ సరిహద్దుల్లో భారత జవాన్ల తలలు నరికి పాకిస్థాన్ జవాన్ల తలలు తెగనరికి తెచ్చిన వారికి రూ.5 కోట్ల నగదు బహుమతి ఇస్తామని ఓ ముస్లిం సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ముస్లిమ్ యువ ఆటంకవాది విరోధి సమితి సంచలన ప్రకటన చేసింది. 
 
ఇటీవల సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ వచ్చిన భారత సైనికుడు పరమ్ జిత్ సింగ్‌, ప్రేమ్ సాగర్ సింగ్‌ల తలలను పాకిస్థాన్ సైనికులు నరికిన విషయం తెల్సిందే. దీనికి ప్రతీకారంగా పాక్ సైనికుల తల నరికి తీసుకురావాలని రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ నగరంలో ఓ ముస్లిమ్ సంస్థ కోరుతూ ఈ ప్రకటన చేసింది. 
 
ముస్లిమ్ యువ ఆటంకవాది విరోధి సమితి అధ్యక్షుడైన ముహమ్మద్ షకీల్ సైఫీ అజ్మీర్ దర్గాను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాక్ సైనికుల తల నరికి తెచ్చిన మన భారత జవాన్లకు రివార్డు ఇచ్చేందుకు వీలుగా తాము తమ సంస్థ వాలంటీర్లు, ప్రజల నుంచి విరాళాలు వసూలు చేస్తున్నామని సైఫీ ప్రకటించారు.