శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 23 మే 2017 (12:54 IST)

మోడీ హత్యకు పాక్ నుంచి ఫోన్.. ఆ ఇద్దరు రెడీ? రూ.50 కోట్ల డీల్?!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరిగిందా? అంటే నిఘా వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా జిల్లాలో సోనీ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని బట్టి.. పాకిస్థాన్ మోడీ హత్య

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరిగిందా? అంటే నిఘా వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా జిల్లాలో సోనీ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని బట్టి.. పాకిస్థాన్ మోడీ హత్యకు ప్లాన్ చేసిందని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా వాసి సోని అనే వ్యక్తికి పాకిస్థాన్‌కు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. 
 
ఆ ఫోన్లో ఆగంతుకుడు మాట్లాడుతూ...''నరేంద్ర మోడీ ముంబై ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఆయన్ని చంపేసేందుకు మాతో చేతులు కలపాలని తెలిపాడు. ఇందుకు అంగీకరిస్తే రూ.50 కోట్లు ఇస్తానన్నాడు. ఇప్పటికీ మోడీని చంపేందుకు ఇద్దరు రెడీగా వున్నారనీ, నీవు కూడా సహకరిస్తే మొత్తం ముగ్గురు కలిసి పక్కా ప్లాన్‌తో మోడీ హత్యను అమలుపరచాలనుకుంటున్నట్లు" ఫోన్లోని వ్యక్తి తెలిపాడు. 
 
అయితే ఈ కాల్‌ను సోనీ సీరియస్‌గా తీసుకోలేదు. అయితే ప్రధానిని హత్య చేయాలంటూ కాల్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.