గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (21:48 IST)

సిఎస్ లతో నరేంద్ర మోడి వీడియో సమావేశం

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన రైల్వే,రోడ్లు,విమానాశ్రయాలు తదితర ప్రాజెక్టులకు సంబంధించి ప్రగతి అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు,వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో బుధవారం ఢిల్లీ నుండి వీడియో సమావేశం ద్వారా ఆయా ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు.

ఈ వీడియో సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి కోటిపల్లి-నరసాపురం నూతన రైల్వేలైను నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ఇతర అంశాల ప్రగతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ తో సమీక్షించారు. 

ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ కోటిపల్లి-నర్సాపురం నూతన రైల్వే లైను నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ వివరాల ప్రతిని ప్రధానికి వివరించారు.భూసేకరణ ప్రక్రియను వేగవతంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు సిఎస్ వివరించారు. 

ఈ వీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్,టిఆర్అండ్బి,వైద్య ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు యంటి.కృష్ణ బాబు,అనిల్ కుమార్ సింఘాల్,వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ కె.భాస్కర్,సిఎస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పి.ప్రశాంతి పాల్గొన్నారు.