శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జూన్ 2017 (11:24 IST)

ఆర్డరిచ్చిన 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికి... 5 గంటలైనా ఫైరింజన్ రావడం లేదు: సిద్ధూ

పంజాబ్ రాష్ట్ర అగ్నిమాకదళ శాఖ పనితీరుపై మాజీ క్రికెటర్, ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోతి సింగ్ సిద్ధూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆర్డరిచ్చిన 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికి వస్తుంది.. కానీ, ఫోన్ చేసి 5 గంటలైనా

పంజాబ్ రాష్ట్ర అగ్నిమాకదళ శాఖ పనితీరుపై మాజీ క్రికెటర్, ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోతి సింగ్ సిద్ధూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆర్డరిచ్చిన 15 నిమిషాల్లో పిజ్జా ఇంటికి వస్తుంది.. కానీ, ఫోన్ చేసి 5 గంటలైనా ఫైరింజన్ రావడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అగ్నిమాపక సిబ్బంది పనితీరును వివరిస్తూ ఆయన చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. పంజాబ్‌లో 550 ఫైరింజన్లు అందుబాటులో ఉండాలి, అయితే కేవలం 150 ఫైరింజన్లు మాత్రమే ఉన్నాయన్నారు. అందులో కాలం చెల్లినవి 100 ఉంటే, సమర్థవంతమైనవి కేవలం 50 అని చెప్పారు. 
 
ప్రస్తుతం పిజ్జాను ఆర్డర్ చేస్తే కేవలం 15 నిమిషాల్లో మన ముందు ఉంటుంది కానీ, ఫైరింజన్ కోసం ఫోన్ చేస్తే ఐదు గంటలైనా రావడం లేదని ఆయన మండిపడ్డారు. అగ్నిమాపక శాఖ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆయన సూటిగా సూచించారు.