1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (09:36 IST)

ఇక దేశంలో రోజుకు 12 గంటల పని - జూలై నుంచి అమలు

amaravati works
దేశంలో కొత్త కార్మిక చట్టాలు జూలై నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చట్టాల ప్రకారం ఇకపై రోజుకు 12 గంటల పాటు పని చేయాల్సివుంటుంది. అలాగే ఓవర్ టై్మ్ 5 గంటల నుంచి 150 గంటలవరకు పెరగనుంది. భవిష్య నిధి కార్మికుడు, యజమాని జమ చేసే మొత్తంలోనూ పెరగనుంది. అలాగే, ఇకపై ఒక యేడాదిలో 180 రోజులు పని చేస్తే అర్జిత సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. 
 
ఈ కొత్త కార్మిక చట్టాలను అనేక కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టాలు అమల్లోకి వస్తే మాత్రం ప్రస్తుతం ఉన్న 8 గంటల పని సమయం 12 గంటలకు పెరుగుతుంది. దీంతోపాటు మరిన్ని మార్పులు రానున్నాయి. జులై ఒకటో తేదీ నుంచి మొత్తం నాలుగు కార్మిక చట్టాలు అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. 
 
పెట్టుబడులు, ఉద్యోగావకాశాల పెంపునకే ఈ చట్టాలు తెస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ చట్టాల ద్వారా వేతనాలు, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, ఆరోగ్యం, రక్షణ, పని పరిస్థితులు వంటి అంశాల్లో ఆశిస్తున్న సంస్కరణలు సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
ఈ చట్టాలు అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న పనిగంటల సమయం 8-9 గంటల నుంచి 12 గంటలకు పెరుగుతుంది. ఓటీ (ఓవర్ టైం) సమయం 50 గంటల నుంచి 150 గంటలకు పెరుగుతుంది. అలాగే, కార్మికుడు, యజమాని జమచేసే భవిష్య నిధి మొత్తం కూడా పెరుగుతుంది. స్థూల వేతనంలో 50 శాతం మూల వేతనం ఉండాలి. ఫలితంగా భవిష్య నిధికి కార్మికుడు జమచేసే మొత్తం పెరుగుతుంది. 
 
యజమాని అంతే మొత్తం జమచేయాల్సి ఉంటుంది. దీని వల్ల పదవీ విరమణ తర్వాత అందుకునే మొత్తం, గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది. ఇప్పటివరకు సంవత్సరంలో 240 రోజులు పనిచేస్తే ఆర్జిత సెలవులు లభిస్తుండగా, ఇకపై దానిని 180 రోజులకు కుదించనున్నారు. ఇంటి నుంచి పనిచేసే వారికి (వర్క్ ఫ్రం హోం) కూడా చట్టబద్ధత లభించనుంది.