పొత్తిళ్ళ తడి ఆరకముందే ట్రైన్ టాయిలెట్‌ రంధ్రంలో పసికందును పడేశారు...

baby boy
Last Updated: సోమవారం, 24 డిశెంబరు 2018 (13:27 IST)
అమృతసర్‌లో ఓ హృదయ విదారకదృశ్యం కనిపించింది. అమృతసర్ ఎక్స్‌ప్రెస్ రైలు టాయిలెట్‌లో ఓ పసికందును మరుగుదొడ్డిని క్లీన్ చేసే పారిశుద్ధ్యం సిబ్బంది గుర్తించారు. పొత్తిళ్ళ తడి ఆరకముందే ఆ పసికందు శరీరానికి దుప్పటికప్పి అందులో పడేశారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అమృతసర్ ఎక్స్‌ప్రెస్ రైలు అమృతసర్ రైల్వే స్టేషన్‌లో ఆగింది. ఆ సమయంలో టాయ్‌లెట్లను శుభ్రం చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు ట్రైన్ ఎక్కారు. వీరు ఓ బోగీలోని మురుగుదొడ్డిని క్లీన్ చేసేందుకు తలుపు తెరవగా అందులో ఓ పసికందును గుర్తించి స్టేషన్ అధికారులకు సమాచారం చేరవేశారు.

టాయిలెట్ రంధ్రంలో మెడ చుట్టూ దుప్పటి కప్పి ఉన్న పసికందును బయటకు తీసి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రైల్వే పోలీసులు చిన్నారిని అమృత్‌‌సర్‌ ప్రభుత్వ హస్పిటల్‌కి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్ శిశువుకు ప్రాణాపాయం లేదని తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :