మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (15:07 IST)

పబ్లిక్‌ టాయిలెట్ ఆచూకీ తెలిపే టాయిలెట్ ఫైండర్ యాప్

రమ్య తన ఆరేళ్ళ కుమార్తెతో కలిసి షాపింగ్ కోసమని ఇంటి నుంచి బయలుదేరింది. మార్గమధ్యంలో పాపకు అర్జెంటుగా మూత్రం వచ్చింది. చుట్టూపక్కల పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడా రమ్యకు కనిపించలేదు. దీంతో ఆమె షాపింగ్‌ వెళ్ల

రమ్య తన ఆరేళ్ళ కుమార్తెతో కలిసి షాపింగ్ కోసమని ఇంటి నుంచి బయలుదేరింది. మార్గమధ్యంలో పాపకు అర్జెంటుగా మూత్రం వచ్చింది. చుట్టూపక్కల పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడా రమ్యకు కనిపించలేదు. దీంతో ఆమె షాపింగ్‌ వెళ్లడం మానేసి పాపను తీసుకుని ఆటోలో ఇంటికి వచ్చేసింది. ఇలాంటి సమస్య ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారికోసమే టాయిలెట్ ఫైండర్ అనే యాప్ ఇపుడు అందుబాటులోకి వచ్చింది.
 
కేవలం మన పరిసర ప్రాంతాల్లోనేకాకుండా తెలియని ప్రాంతాలకు వెళ్లినపుడు కూడా ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతోంది. సాధారణంగా మూత్రం వస్తున్న సమయంలో మూత్రశాల ఎక్కడుందో కనుక్కోవడం చాలా కష్టం. పైగా, ఎవరిని అడగాలన్నా కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. 
 
ఇలాంటివారి కోసమే 'టాయిలెట్‌ ఫైండర్' యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందులో మనమున్న ప్రదేశానికి దగ్గర్లో ఉన్న పబ్లిక్‌ టాయిలెట్ల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే రెస్టారెంట్లు, షాపింగ్‌మాళ్లు, ఆస్పత్రులు, పెట్రోల్‌ బంకులు ఇలా ఎలాంటి ప్రదేశాల్లో అవి అందుబాటులో ఉన్నాయో వాటి వివరాలు సులభంగా తెలుసుకుని అక్కడకు వెళ్ళి మీపని పూర్తి చేసుకోవచ్చు. ఈ టాయిలెట్ ఫైండర్ యాప్‌ను గూగుల్ ప్రారంభించినప్పటికీ.. కొన్ని ప్రదేశాల్లోనే అందుబాటులో ఉంది.