గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (12:19 IST)

కుటుంబ గొడవలు.. నవ వరుడు ఆత్మహత్య

maheswara
కర్నాటక రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. కుటుంబ గొడవల కారణంగా నవ వరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగుళూరు ఉళ్ళాల ఎంవీ లే ఔట్‌లో ఈ విషాదం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ప్రాంతానికి చెందిన మహేశ్వర (25) అనే వ్యక్తికి మూడు నెలల క్రితం కవన అనే యువతితో వివాహమైంది. అయితే వారి మధ్య ఏం జరిగిందో తెలియదుగానీ, ఐదు రోజుల క్రితం మహేశ్వర తన ఇంటిలోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాల కారణంగానే మహేశ్వర బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.