శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (14:12 IST)

ఉత్తరప్రదేశ్‌లో వర్షబీభత్సం: గోడకూలి 9మంది మృతి

Rains
ఉత్తరప్రదేశ్‌లో వర్షబీభత్సం సృష్టిస్తోంది. లక్నో పరిధిలో రోడ్లన్నీ నీటమునిగాయి. పలు కాలనీలు జలమయం అయ్యాయి. జానకీపురంలోని ఇంజినీరింగ్ కాలేజ్, రివర్ ఫ్రంట్ కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరదల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
ఎడతెరిపిలేని వర్షాల వల్ల గోడ కూలిన ఘటనలో గుడిసెలో నివసిస్తున్న 9 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. దీంతో పాటు గాయపడిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.