శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (15:52 IST)

నిర్మలాదేవికి భర్త ఝలక్.. విడాకుల కోసం నోటీసులు పంపాడు..

తమిళనాడులో సంచలనం రేపిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో రోజుకో కొత్త కథ వెలుగులోకి వస్తుంది. యూనివర్శిటీ పెద్దల లైంగిక అవసరాలు తీర్చాలంటూ చదువుకునే అమ్మాయిలను వేధించిన నిర్మలా దేవికి ఆమె భ

తమిళనాడులో సంచలనం రేపిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో రోజుకో కొత్త కథ వెలుగులోకి వస్తుంది. యూనివర్శిటీ పెద్దల లైంగిక అవసరాలు తీర్చాలంటూ చదువుకునే అమ్మాయిలను వేధించిన నిర్మలా దేవికి ఆమె భర్త శరవణ పాండియన్ విడాకుల నోటీసులు పంపాడు. ఇలాంటి భార్య తనకొద్దని, విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
నిర్మలా దేవి తీరు నచ్చక ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఆమె భర్త.. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సహనంతో తన ఆలోచనను విరమించుకున్నాడు. తన కుమార్తెలను కూడా అదే పనికి పురమాయిస్తానని నిర్మల బెదిరించినట్లు ఆడియో రికార్డులు బయటకు రావడంతో నిర్మలాదేవి నుంచి విడాకులు తీసుకోవాలని ఆమె భర్త దరఖాస్తు చేసుకున్నారు. 
 
ఇకపోతే.. నిర్మలాదేవిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమె వద్ద దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మలాదేవి ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేసిన సీబీసీఐడీ అధికారులు, ఓ పెన్ డ్రైవ్, ల్యాప్ టాప్, కంప్యూటర్, సీడీలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ ఇంటికి సీల్ వేశారు.