1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (09:29 IST)

పనిమనిషిని కాదు.. ఉద్యోగిని : ప్రయాణికుడితో ఇండిగో ఎయిర్‌హోస్టెస్ వాగ్వాదం

airhostess
ఇస్తాంబుల్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు, ఎయిర్‌హోస్టెస్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. దీన్ని మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ప్రయాణికుడికి నువ్వు సేవకురాలివి అంటూ ప్యాసింజర్ తీవ్ర వ్యాఖ్యలు చేయగా, ఎయిర్ హోస్టెస్ కూడా అంతే ఘాటుగా సమాధానమిచ్చింది. నేను పనిమనిషిని కాదని ఉద్యోగినని తీవ్ర స్వరంతో బదులిచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 16వ తేదీన ఇస్తాంబుల్ - న్యూఢిల్లీ విమానంలో ఎయిర్‌హోస్టెస్ ఓ వ్యక్తితో మాట్లాడుతూ, మీ వల్ల మా ఉద్యోగి ఏడుస్తున్నారని, బోర్డింగ్ పాస్‌లో ఏముంటే దాని ప్రకారమే ఆహారాన్ని అందిస్తామని చెప్పారు. దీనికతడు తీవ్రంగా స్పందించాడు. ప్రయాణికుడికి నువ్వు సేవకురాలివి అంటూ వ్యాఖ్యానించగా, ఎయిర్‌హోస్టెస్ కూడా ధీటుగానే బదులిచ్చింది. 
 
తాను పనిమనిషిని కాదని, ఉద్యోగినని తీవ్ర స్వరంతో చెప్పారు. దీనికి అతడు ఎందుకు అరుస్తున్నావ్.. నోర్మూసుకో అని హెచ్చరించాడు. నువ్వు కూడా నోర్మూసుకో అని ఎయిర్‌హోస్టెస్‌ బదులిచచ్చింది. కేవలం ఆహారం అందించే విషయంలో జరిగిన ఈ గొడవలో ఇద్దరూ ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. చివరికి సహోద్యోగి వారించడంతో ఈ గొడవ సద్దుమణిగింది. ఇపుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.