శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2019 (11:01 IST)

నీట్ 2020 పరీక్షలు- షెడ్యూల్ విడుదల.. పరీక్ష రాసినవారు కూడా..

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు- నీట్ 2020 తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎన్‌టీఏ నిర్వహించే పలు పరీక్షల తేదీలతో పాటు నీట్ యూజీ 2020 షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 2020 మే 3న నీట్ టెస్టులను నిర్వహించనున్నారు. 
 
దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 2న ప్రారంభమై డిసెంబర్ 31న ముగుస్తుందని ఎన్‌టీఏ వెల్లడించింది. దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులంతా ఎన్టీఏనీట్‌డాట్ఎన్ఐసి‌డాట్ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
 
ఇకపోతే.. ప్లస్ టూ లేదా ఇంటర్ పాసైనవారు, పరీక్ష రాసినవారు NEET UG 2020 ఎగ్జామ్‌కు దరఖాస్తు చేయొచ్చు. నీట్ 2020 ఎగ్జామ్‌తో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పలు పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. 
 
ఈ మేరకు 
పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ డేట్స్ - 2 నుంచి 31 వరకు డిసెంబర్ 2019 
అడ్మిట్ కార్డులు - 27 మార్చి 2020 నుంచి పొందవచ్చు. 
పరీక్ష జరిగే తేదీ - మే 3, 2020 
ఫలితాల విడుదల- జూన్ 4, 2020.