బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (11:25 IST)

మోసపోయిన ఢిల్లీ సీఎం కూతురు

సైబర్ నేరగాడి చేతిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత మోసపోయింది. ఓ ఈ కామర్స్ సైట్లో పాత సోఫాను అమ్మకానికి పెట్టగా, ఓ వ్యక్తి ఆమెను సంప్రదించాడు. QR కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే తాను ఇవ్వాల్సిన మొత్తం అకౌంటు ట్రాన్స్ఫర్ అవుతుందని నమ్మించాడు.
 
అలా చేయగానే హర్షిత ఖాతా నుంచి రూ.20 వేలు మాయమయ్యాయి. అది తప్పు కోడ్ అని, సరైన కోడ్  పంపుతానని నమ్మించాడు. అలా మరో రూ.14వేలు ఖాళీ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని మోసగాడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.