బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (17:28 IST)

భర్తలేడని.. అర్థరాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు..

తన కుమార్తెతో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తిని తన కుమారులతో కలిసి కొట్టి చంపిన ఘటన తమిళనాడు, తూత్తుకుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడికి చెందిన మైకేల్ జయరాజ్‌కు ముగ్గురు కుమారులు.. ఒక కుమార్తె వున్నారు.


జయరాజ్ కుమార్తె కళకు పెరియసామి అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెరియసామి తిరుప్పూరులో ఉద్యోగం కోసం వెళ్లాడు. దీంతో కళ తల్లిదండ్రుల ఇంటి పక్కనే అద్దెకు వుంటోంది. భర్త ఉద్యోగం కోసం బయటూరుకు వెళ్లడంతో ఒంటరిగా వుంటూ వచ్చిన కళకు సహాయమణి అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. 
 
ఈ సంబంధం కారణంగా సహాయమణి అప్పుడప్పుడు కళ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ వ్యవహారం కళ తండ్రికి తెలియవచ్చింది. దీనిపై ఇద్దరినీ హెచ్చరించాడు. కానీ వారిలో మార్పు రాలేదు. ఇంకా రాత్రిపూట కళ ఇంటికి సహాయమణి రావడం మొదలెట్టాడు. అలా ఓ రోజు రాత్రి కళ ఇంటికి వెళ్ళిన సహాయమణిపై జయరాజ్‌ అతని కుమారులు దాడి చేశారు. 
 
కన్నకూతురు తప్పుచేస్తుందని.. ఆమెపై కూడా దాడి చేశారు. ప్రేయసితో కలిసివున్న తరుణంలో జయరాజ్.. అతని కుమారులు అర్థరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన సహాయమణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జయరాజ్ అతని కుమారులను అరెస్ట్ చేశారు.