1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (10:01 IST)

రూ. 2.50 తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో మరోసారి పెట్రో ధరలు తగ్గనున్నాయి.  పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2.50 పైసలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రావచ్చని సమాచారం. 
 
దేశ ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ఆగస్టు నుంచి పెట్రోల్ ధరలు తగ్గడం ఇది ఆరోసారి. అక్టోబర్ నెలలోనే పెట్రోల్ ధర రెండుసార్లు లీటర్‌కు రూ. 2 చొప్పున తగ్గింది. డీజిల్ ధరలపై నియంత్రణను ప్రభుత్వం తొలగించడంతో అక్టోబర్ 19న లీటర్ డీజిల్‌పై రూ. 3.37 పైసలు తగ్గింది. 
 
కాగా  జమ్మూకాశ్మీర్, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలు మళ్లీ తగ్గనుండటం గమనార్హం. పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేసిన నేపథ్యంలో ధరల తగ్గింపు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని భావిస్తున్నారు.