పంజాబ్‌లో గ్రాండ్ విక్టరీ - ప్రధాని మోడీ అభినందనలు
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 117 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 92 స్థానాలను దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలతో రెండో స్థానంలో నిలువగా, శిరోమణి అకాలీదళ్ నాలుగు, బీజేపీ దాని మిత్రపక్షాలు రెండు సీట్లతో సరిపెట్టుకున్నాయి.
ఈ విజయంతో ఆప్ పార్టీ ఢిల్లీ ఆవల తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా, ఈ విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీకిగా తీర్చిదిద్దాలని అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. పంజాబ్ సంక్షేమం కోసం ఆ పార్టీకి అవసరమైన పూర్తి సహకారం అధిస్తామని హామీ ఇస్తున్నట్టు చెప్పారు.