శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జనవరి 2024 (16:23 IST)

కేంద్ర మంత్రి మురుగన్ ఇంట్లో సంక్రాంతి వేడుకలు.. సంప్రదాయ వస్త్రాధరణలో ప్రధాని మోడీ

modi sankranti celebrations
ఢిల్లీలోని కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకులకు ప్రధాని నరేంద్ర మోడీ సంప్రదాయ వస్త్రాధారణలో హాజరయ్యారు. పంచె, చొక్కా, కండువాను ధరించి ఆయన ప్రత్యేకపూజలు శారు. ఈ పండుగ ప్రజలందరికీ సుఖశాంతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. 
 
కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ నివాసంలో గోమాతకు పూలదండ వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ పొంగల్ శుభకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్‌లు తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో తమిళ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రధాని మోడీ పంచెకట్టులో రావడం ప్రతి ఒక్కరినీ ఎంతగానే ఆకట్టుకుంది. 
 
మణిపూర్ ‌నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర 
 
మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించనున్నారు. పెదేళ్ల మోడీ అన్యాయ్ కాల్ కి వ్యతిరేకంగా ఆయన ఈ యాత్రను చేపట్టారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 11 రోజుల పాటు సాగనుంది. మార్చి 20వ తేదీన ఆయన ఈ యీత్రను మహారాష్ట్రలో ముగిస్తారు. 
 
ఈ యాత్ర మొత్తం 15 రాష్ట్రాలు, 100 లోక్‌సభ స్థానాలు, 110 జిల్లాల మీదుగా సాగుతుంది. 6,700 కిలోమీటర్లు సాగనున్న ఈ యాత్ర మొత్తం 67 రోజులపాటు కొనసాగుతుంది. అలాగే, 337 అసెంబ్లీ నియోజకవర్గాలమీదుగా యాత్ర సాగుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ యాత్ర గురించి కాంగ్రెస్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ పదేళ్ల 'అన్యాయ్ కాల్'కి వ్యతిరేకంగా జరుగుతున్న యాత్రగా దీనిని అభివర్ణించింది. ఈశాన్య రాష్ట్రంలో ప్రారంభమవుతున్న ఈ యాత్ర మార్చి 20న మహారాష్ట్రలో ముగుస్తుంది. 
 
కాగా, రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్‌‌లో కొనసాగుతుంది. రాష్ట్రంలోని 20 జిల్లాల మీదుగా 1,074 కిలోమీటర్లపాటు 11 రోజులపాటు సాగుతుంది. ఝార్ఖండ్‌, అస్సాంలో 8 రోజుల చొప్పున, మధ్యప్రదేశ్‌లో 7 రోజులపాటు యాత్ర కొనసాగుతుంది. 
 
మరీ ముఖ్యంగా రాజకీయంగా అత్యంత ముఖ్యమైన యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలోనూ రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. బీహార్‌లో ఏడు జిల్లాలు, ఝార్ఖండ్‌లో 13 జల్లాలను కవర్ చేసే రాహుల్ యాత్ర ఆయా జిల్లాల్లో వరుసగా 425 కిలోమీటర్లు, 804 కిలోమీటర్లు కొనసాగుతుంది.