శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2024 (18:30 IST)

బీజేపీ కురువృద్ధుల ఆశీర్వాదాలు తీసుకున్న కాబోయే ప్రధాని మోడీ!!

advani - modi
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనను ఎన్డీయే కూటమి నేతగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఆ కూటమి భాగస్వామ్య పార్టీల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆయన బీజేపీ కురువృద్ధులను కలుసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని ద్రౌపది ముర్మును కోరనున్నారు. 
 
ఇందుకోసం రాష్ట్రపతి వద్దకు వెళ్లడానికి ముందు నరేంద్ర మోడీ బీజేపీ కురువృద్ధులు ఎల్కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కలుసుకున్నారు. అలాగే, మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కూడా ఆయన కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. 
 
తొలుత బీజేపీ అగ్రనేత ఎల్కే.అద్వానీ నివాసానికి వెళ్లిన మోడీ... ఆ తర్వాత మురళీ మనోహర్ జోషి నివానికి, ఆ పిమ్మట రాంనాథ్ కోవింగ్ నివాసాలకు వెళ్లారు. ఇదిలావుంటే, ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు దేశ ప్రధానిగా ఆయన మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.