1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (15:20 IST)

దూరదృష్టితో కూడిన బడ్జెట్ : ప్రధాని నరేంద్ర మోడీ

లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దూరదదృష్టితో కూడిన బడ్జెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. బడ్జెట్ స్పష్టమైన విజన్‌తో అభివృద్ధికి సోపానంలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఈ బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేలా ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సమప్రాధాన్యం ఇచ్చారని, గృహ, విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాలపై దీర్ఘకాల లక్ష్యాల్ని నిర్ధేశించుకోవడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.
 
రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం కల్పించడం, నల్లధనంపై చట్టం తేవాలన్న ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పట్టేవిగా ఉన్నాయన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేలా పలు కొత్త పథకాలు రూపొందించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.