శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (15:11 IST)

నరేంద్ర మోదీపై రాహుల్ ఫైర్: అబద్ధాలలో ప్రజలను మోసం చేస్తున్నారు..

rahul gandhi
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఫైర్ అయ్యారు. చైనా-భారత్ సరిహద్దు వివాదానికి సంబంధించి మోదీపై రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత్‌లో ఇంచు కూడా చైనా కబ్జా చేయలేదంటూ మోదీ అన్నీ అబద్ధాలే చెప్పారంటూ మండిపడ్డారు. ఈ విషయం లడ్ఢాఖ్‌లో వున్న ప్రజలకు కూడా తెలుసునన్నారు. 
 
మన భూమిలో మన ప్రజలను కూడా ఆ ప్రాంతంలోకి చైనా అనుమతించడం లేదని, ఆఖరికి వారి పశువులను గడ్డి మేయడానికి కూడా అక్కడికి రానివ్వడం లేదని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని మోదీని కోరానని.. అయిన ఆయన అబద్ధాలలో ప్రజలను మోసం చేస్తున్నారని రాహుల్ తప్పుబట్టారు.