గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (11:27 IST)

సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి... 13 మంది అరెస్టు

nitish kumar
ఇటీవల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్లదాడి చేసిన కేసులో ఆ రాష్ట్ర పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ వెల్లడించారు. 
 
వాస్తవానికి గయాలో సీఎం నితీశ్ కుమార్ సోమవారం పర్యటించాల్సివుంది. దీంతో ఆదివారం సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే, కొందరు యువకులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గయా హైవేపై ధర్నాకు దిగారు. ఆ సమయంలోనే సీఎం కాన్వాయ్ కార్లు అటుగా రావడంతో ఆందోళనకారులు ఆ కార్లపై రాళ్లదాడి చేశారు. 
 
అయితే, ఈ రాళ్ళదాడి సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అయినప్పటికీ ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి 13 మంది నిందితులను అరెస్టు చేశారు.