ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 మే 2024 (11:21 IST)

వాయుసేన కాన్వాయ్‌పై దాడి నిజం కాదు.. బీజేప స్టంట్స్ : పంజాబ్ మాజీ సీఎం

charanjith channy
పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చరణ్ జిత్ సింగ్ ఛన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో పూంచ్ జిల్లాలో వాయుసేన కాన్వాయ్‌పై దాడిని బీజేపీ ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు. 'ఇవన్నీ స్టంట్స్.. టెర్రరిస్టు దాడులు కాదు. ఇవన్నీ ఎన్నికలు ముందు బీజేపీ స్టంట్లు. వీటిల్లో నిజం లేదు. ప్రజల ప్రాణాలు, దేహాలతో బీజేపీ చెలగాటమాడుతోంది' అని చరCణ్ జిత్ సింగ్ అన్నారు. 
 
ఇలాంటి ఘటనలతో బీజేపీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఛన్నీ ఆరోపించారు. ముందస్తు ప్రణాళికలతో బీజేపీ విజయావకాశాలు పెంచేందుకు ఈ దాడుల రూపకల్పన జరిగిందని ఆరోపించారు. 'ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఇలాంటి స్టంట్లు ప్లే చేస్తుంటారు. గత ఎన్నికల్లో కూడా ఇలాంటి దాడులు జరిగాయి' అని ఆయన అన్నారు.
 
పూంఛ్ జిల్లాలోని సనాయ్ గ్రామంలో శనివారం ఉగ్రవాదులు వాయుసేన కాన్వాయ్‌పై ఏకే-47 రైఫిళ్లతో దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఎయిర్ ఫోర్స్ సిబ్బందిలో ఒకరు మృతిచెందగా మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. దాడి తరువాత ఉగ్రవాదులు సమీప అడవిలోకి పారిపోయారని అధికారులు భావిస్తున్నారు. టెర్రరిస్టుల జాడ కనిపెట్టేందుకు స్థానికంగా భారీ సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో స్థానిక పోలీసులతో పాటు ఆర్మీ కూడా పాలుపంచుకుంది.
 
మరోవైపు ఈ దాడిని రాహుల్ గాంధీ ఖండించారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దాడిలో అమరులైన సైనికుడికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేశారు. దాడిలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.