సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (12:26 IST)

జీవితంలో తొలిసారి పేదరిక నిర్మూలన చూస్తున్నా : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

murmu
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. జీవితంలో తొలిసారి పేదరిక నిర్మూలన చూస్తున్నా అని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. పార్లమెంట్ నూతన భవనంలో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క గిరిజన యూనివర్శిటీ ప్రారంభంకాబోతుందని చెప్పారు. గత పదేళల్లో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. 
 
నూతన భవనంలో రాష్ట్రపతి హోదాలో ఆమె తొలి సారి ప్రసంగం చేశారు. ఇందులో పలు కీలక అంశాలపై స్పందించారు. ఆదియాసీ యోధులను స్మరించుకోవడం మనకు గర్వకారణంగా ఉందన్నారు. భగవాన్ బిర్సాముండై జన్మదినాన్ని జన్ జాతీయ దివస్‌గా జరుపుకుంటున్నట్టు చెప్పారు. శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందని తెలిపారు. చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ గత యేడాది చరిత్ర సృష్టించిందన్నారు. అలాగే, సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్-1 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించామని, జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సును నిర్వహించామని తెలిపారు. 
 
భారత్‌లో తొసిరా ఆసియా క్రీడల్లో 107 పతకాలు, పారా ఒలింపింక్స్‌లో 111 పతకాలు సాధించిందని ప్రశంసించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నారీశక్తి వందన్ అధినియం బిల్లును ఆమోదించుకున్నట్టు తెలిపారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా దేశం ముందుకు సాగుతుందన్నారు. తన చిన్పప్పటి నుంచి గరీబీ హటావో అనే నినాదం గురించి వింటూనే ఉన్నానని, కానీ, తన జీవితంలో తొలిసారి పెద్ద ఎత్తున పేదరిక నిర్మూలన చూస్తున్నట్టు చెప్పారు. గత పదేళ్ల కాలంలో 25 కోట్ మంది పేదరికం నుంచి బయటపడ్డారని రాష్ట్రపది ముర్ము గుర్తు చేశఆరు. రామ మందిర కల సాకారమైందని, ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాంకింగ్ రంగాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని చెప్పారు.