ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (17:22 IST)

Priyanka Gandhi Dosa-Making.. మైసూరులో దోసెలను సిద్ధం చేసిన మాస్టర్ చెఫ్

priyanka gandhi
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేవలం రాజకీయ నాయకురాలే కాదు. ప్రతిభ కలిగిన మహిళ. కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో, మైసూరులోని వంటలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపారు. 
 
కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డికె శివకుమార్, పార్టీ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా, మరికొంత మందితో కలిసి ఆమె రుచికరమైన ఇడ్లీలు, దోసెలను ఆస్వాదించడానికి ప్రసిద్ధ మైలారీ హోటల్‌ను సందర్శించారు.
 
ఈ మేరకు ప్రియాంక గాంధీ దోసెలను తయారీ చేయడంపై ఆసక్తి కనబరిచారు. రెస్టారెంట్ యజమాని పర్మిషన్‌తో ఆమె తవాపై పిండిని పోసి, దానిని సూపర్ దోసెగా సిద్ధం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.