ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (14:19 IST)

మహారాష్ట్రలో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీ.. హమ్మయ్య ప్రాణనష్టం లేదు

trains
మహారాష్ట్రలో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని దాదర్, మటుంగాల మధ్య ఒకే ట్రాక్‌పై జరిగింది. ఛేంజింగ్ సమయంలో రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గదగ్ ఎక్స్‌ప్రెస్, పుదుచేరి ఎక్స్‌ప్రెస్‌లు ట్రాక్ ఎక్స్చేంజ్ సమయంలో ఒకదానికొకటి ఎదురెదురై ఢీ కొన్నాయి. 
 
ఈ ఘటన దాదర్, మటుంగా రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. రెండు రైళ్లు ఢీ కొనడంతో హెడ్ వైర్ తెగిపోయి..భారీ పేలుడు శబ్దం వినిపించింది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్లు తక్కువ వేగంతోనే ఉన్నాయి.

రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొట్టడంతో కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పాయి. కానీ ప్రాణనష్టం ఏర్పడలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.