శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 29 డిశెంబరు 2018 (10:06 IST)

ఇంటి వద్ద ఏలియన్స్ ఎగురుతున్నాయ్.. మోదీ కార్యాలయానికి లేఖ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ వచ్చింది. ఆ లేఖలో ఏలియన్స్ వచ్చేశాయని మోదీ కార్యాలయానికి లేఖ అందింది. ఈ లేఖ రాగానే పోలీసులు పరుగులు తీశారు.


తన ఇంటి వద్ద గ్రహాంతరవాసులకు చెందిన ఓ వస్తువు ఎగురుతూ కనిపించిందని వుందని పూణేకు చెందిన ఓ వ్యక్తి (47) లేఖను రాశాడు. ఈ లేఖను గమనించిన అధికారులు వెంటనే మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు. 
 
దీంతో సదరు వ్యక్తి ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులకు షాక్ తగిలింది. చివరికి కొన్నేళ్ల క్రితం తలకు బలమైన గాయం కావడంతో లోపల రక్తస్రావం జరిగిందని.. అప్పటి నుంచి ఇలాగే పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని.. ఆతని కుటుంబీకులు తెలిపారు.