శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (20:21 IST)

వివాహేతర సంబంధం.. పెళ్లి చేసుకోమని బలవంతం.. 35 సార్లు కత్తితో...?

knife
వివాహేతర సంబంధాలు నేరాలకు కారణమవుతున్నాయి. వివాహేతర సంబంధం.. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిన మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు 35 సార్లు కత్తితో పొడిచి పాశవికంగా హత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పుణేకు చెందిన రూపాంజలి అనే వివాహితకు జయరామ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 
 
ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. రూపాంజలికి భర్త ముగ్గురు పిల్లలున్నారు. అయితే జయరామ్‌ను వివాహం చేసుకోవాలని ఆమె పట్టుబట్టింది. 
 
ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని జయరామ్​ను బలవంత పెట్టింది. అంతే విసిగిపోయిన జయరామ్ ఆమెను పక్కా ప్లాన్ ప్రకారం అతడు స్నేహితుడు సూరజ్‌తో కలిసి పదునైన కత్తితో 35 సార్లు రూపాంజలిని పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  48 గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు.