శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (11:01 IST)

ట్రాన్స్ జెండర్ ప్రేమలో ఫ్రెంచ్ జట్టు కెప్టెన్ ఎంబాప్పే

Mbappe
Mbappe
ఇటీవల ఖతార్‌లో జరిగిన 22వ ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా ట్రోఫీని గెలుచుకుంది. గత ఏడాది ట్రోఫీ నెగ్గిన ఫ్రాన్స్ ఈసారి రెండో స్థానంలో నిలిచింది. ఇక ఫ్రెంచ్ జట్టు కెప్టెన్ ఎంబాప్పేకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో పీలే రికార్డును సమం చేశాడు. ఖతారే ప్రపంచ కప్ లో గోల్డెన్ బూట్ విన్నర్ గా నిలిచాడు ఎంబాప్పే. 
 
ఈ నేపథ్యంలో నటి ఎమ్మా స్మెట్‌తో విడిపోయిన తర్వాత కైలియన్ Mbappe చాలా నెలలుగా ప్రముఖ మోడల్ ఇనెస్ రౌతో డేటింగ్ చేస్తున్నాడని ఇటాలియన్ వార్తా సంస్థ కొరియర్ డెల్లో స్పోర్ట్స్ నివేదించింది. మీడియా నివేదికల ప్రకారం, Mbappe, Rau చాలా నెలలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 
 
ఈ సంవత్సరం మేలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా మొదటిసారి కలిసి కనిపించారు. ఇనెస్ రౌ.. నవంబర్ ప్లేబాయ్ మ్యాగజైన్ 'ప్లేమేట్ ఆఫ్ ది మంత్ గా నిలిచింది. ఈ మ్యాగజైన్ పేజీలో కనిపించిన మొదటి లింగమార్పిడి మహిళగా ఆమె నిలిచింది. ఈమె ట్రాన్స్ జెండర్ కావడం గమనార్హం.