శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (13:36 IST)

రాజస్థాన్ నదిలో పడిపోయిన బస్సు: 24 మంది మృతి

బస్సు ప్రమాదం
రాజస్థాన్‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. బూండీలోని కోట లాల్‌సాత్‌ మెగా హైవేపై వేగంగా వెళుతున్న బస్సు మేజ్ నదిలో పడిపోయింది. పెళ్లి వేడుక నిమిత్తం బంధువులతో కోట నుంచి సవాయ్‌మాధోపూర్‌ బస్సు బయలుదేరింది. ఐతే బస్సు డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడంతో బస్సు అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయింది.
 
బస్సులో 40 మంది ప్రయాణికులుండగా ఇప్పటి వరకు 24 మంది మృతదేహాలను వెలికితీశారు. మరికొందర్ని స్థానికులు రక్షించారు. ఐతే ఇంకొందరు గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రమాద వార్తను తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపడుతున్నారు.