మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2020 (09:14 IST)

వీడు మొగుడా లేకుంటే రాక్షసుడా..? భార్య నిప్పంటుకుంటే.. వీడియో తీసి..?

అత్తారింట వేధింపులు తాళలేక ఓ మహిళ నిప్పంటించుకుంది. అయితే భార్య ఆత్మహత్యకు పాల్పడుతుంటే.. దానిని అడ్డుకోని భర్త ఆ దృశ్యాలను ఫోన్‌లో వీడియో తీస్తూ ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత ఆ వీడియోను ఇతర కుటుంబ సభ్యులకు పంపి రాక్షన ఆనందం పొందాడు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్‌లోని ఝుంఝు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన మనీషా కుమారి, అనిల్ కుమార్కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయింది. అయితే అత్తింటి వేధింపులు భరించలేక మనీషా ఈ నెల 20న ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. పూర్తిగా కాలిన గాయాలతో ఉన్న ఆమె జైపూర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 22 మరణించింది. 
 
అయితే మనీషా ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో అక్కడే ఆమె భర్త, ఇతర కుటుంబసభ్యులు దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. పైగా ఈ దృశ్యాలను వీడియో తీసి పలువురికి పంపారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, నవంబర్ 24న ఈ ఘటనకు సంబంధించి మనీషా సోదరుడు అనిల్ కుమార్ అతని తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
దీంతో పోలీసులు అనిల్ కుమార్, అతని తల్లిదండ్రులతో పాటుగా మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు."మనీషాకు 2012లో పెళ్లి అయింది. 2019లో భర్త, ఇతర కుటుంబ సభ్యులపై ఆమె గృహ హింసకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల ఆత్మహత్య చేసుకుంది" అని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు చెప్పారు.