మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (16:48 IST)

వార్నర్ సినిమాల్లోకి వస్తాడా? ఎన్టీఆర్‌లా అదరగొట్టాడుగా..?

David Warner
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో యాక్టివ్ వుంటాడనే సంగతి తెలిసిందే. గతంలో అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసిన వార్నర్.. తాజాగా ఆ పాట 400 మిలియన్ల వ్యూస్ చేరుకోవడంతో అల్లు అర్జున్‌ను ప్రశంసిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 
 
ప్రస్తుతం డేవిడ్ వార్నర్ సామాజిక మాధ్యమాల్లో మరోసారి అభిమానులను అలరించాడు. తాజాగా ఎన్టీఆర్‌ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలోని ఓ ఫైట్‌ సన్నివేశాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అతనిలా నటిస్తూ ఉన్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. 
 
ఎన్టీఆర్ ఫేస్‌ స్థానంలో అతడు ముఖాన్ని కనిపించేలా వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. ''ఇది ఎలా ఉంది. ఇది ఏ సినిమాకు సంబంధించింది.. ఇందులో హీరో ఎవరూ? ఎక్కువ మంది దీనికి సమాధానం చెప్పలేరెమో'' అంటూ ఓ క్యాప్షన్ జత చేశాడు.
 
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిక్షణాల్లోనే లక్షలా సంఖ్యాలో లైకులు వచ్చాయి. కామెంట్లు వెల్లువెత్తాయి. కాగా.. టాలీవుడ్ టాప్ హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబులను అనుకరించిన వార్నర్.. ప్రస్తుతం ఎన్టీఆర్‌‌ను ఈ వీడియోతో ఫాలో అయ్యాడు. 
 
కాగా గతంలో పోకిరి సినిమా డైలాగ్ చెప్పినపుడు దర్శకుడు పూరీ జగన్నాథ్ చూసి తన సినిమాలో అవకాశం కూడా ఇస్తానని చెప్పాడు. మొత్తానికి డేవిడ్ వార్నర్‌ సినిమాల్లోకి వచ్చే ఛాన్సులు కూడా వున్నాయని టాలీవుడ్ జనం అనుకుంటున్నారు.